విస్తృతంగా ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం
ప్రజాశక్తి-జలదంకి : పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దమ్ము దర్గాబాబు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లూరు మాల్యాద్రి సోమవారం గట్టుపల్లి, చింతలపాలెం, జలదంకి ఓటరు అభ్యర్థులు ఇంటింటి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వం రంగ సంస్థల పరిరక్షణ ప్రజా కార్మిక ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు పరిష్కారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. శాసన మండలిలో ప్రజల గొంతుక వినిపించే పిడిఎఫ్ అభ్యర్థులైన తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి మీగడ వేంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి పొక్కిరెడ్డి బాబురెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ మేరకు కరపత్రాలు ద్వారా హాస్పిటల్, హైస్కూల్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్, పోస్టు ఆఫీసు, రెవెన్యూ, ప్రభుత్వ కార్యాలయలు తదితర వద్ద ఓటర్లను సంప్రదించి కరపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మార్చి 13న జరుగుతున్న శాసన మండలి ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.










