రాయచోటి టౌన్ : రాయచోటి ఏరియా ఆసుపత్రిలో రోగి సహాయకుల సౌకర్యార్థం విశ్రాంతి గదులను నిర్మింపచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ఆసుపత్రి ప్రాంగణంలో రూ.36 లక్షల సొంత డబ్బుల వ్యయంతో రోగి సహాయకుల వసతి గదులున వీరబల్లె మండలం గడికోట కు చెందిన వి మల్లికార్జున రెడ్డి, వారి కుమారుడు భార్గవ్‌రెడ్డి నిర్మించారు. వాటిని సోమ వారం ఆయన ప్రారబించారు. ఈ సందర్భంగా గదుల నిర్మాణ దాత మల్లికా ర్జునరెడ్డిని ఎమ్మెల్యే, ఆసుపత్రి వైద్యాధికారులు, పట్టణ ప్రముఖులు పూల మాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలును త్వరితగతిన పూర్తి చేయాలని ఎపిఎండిఐసి అధికారులకు సూచించారు. నిర్మాణ పనులపై ఆయన ఆరా తీశారు. జులైలోగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లాఖాన్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మహేశ్వర రాజు, డాక్టర్ రెడ్డిభాస్కర్ రెడ్డి, లక్ష్మీ ప్రసాద్, దుద్యాల బసిరెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి, కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నర సింహారెడ్డి, ఫయాజ్ అహ మ్మద్, ఎస్‌పిఎస్ రిజ్వాన్, షబ్బీర్, రత్నశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా సభ్యుడు దిన్నెపాడు రవిరాజు, పల్లా రమేష్, గువ్వల బుజ్జి బాబు, ఎపి ఎంఐడిసి ఎస్‌ఇ కష్ణా రెడ్డి, ఇఇ సురేంద్ర నాధరెడ్డి పాల్గొన్నారు.










