May 03,2023 20:46

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు
-సిపిఎం, సిఐటియు రూరల్‌ కమిటీలు ఆధ్వర్యంలో రాస్తారోకో
నెల్లూరు:విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకూడదని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ , కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నగరంలోని ఆర్‌టిసి బస్టాండ్‌ ప్రాంతంలో సిపిఎం, సిఐటియు రూరల్‌ కమిటీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దాదాపు అర్ధగంట పాటు రాస్తారోకో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ కార్యదర్శి బత్తల కష్ణయ్య మాట్లాడుతూ గత 25 సంవత్సరాల కిందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పెద్ద ఎత్తున పోరాడి32 మంది బలిదానముతో 26,000 వేలు ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను నిర్మించిందన్నారు. అటువంటి పరిశ్రమను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ది బాటపట్టించాయన్నారు. మంచి ఉక్కు ఫ్యాక్టరీగా పేరుగాంచినది. 40,000 మంది పైగా ఉద్యోగులు, కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అనేక మంది ఈ పరిశ్రమను నమ్ముకొని లారీ కార్మికులుగా ,ట్రాన్స్పోర్ట్‌ కార్మికులుగా వేలాది మంది జీవనం సాగిస్తున్నారు
. కేంద్రంలో బిజెపి అధికారం కొచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ పై కన్నుబడి ప్రైవేటు వ్యక్తు లైనా అదానికి అమ్మచూపి ఆ ఫ్యాక్టరీ రావలసిన ఇనుప ఖనిజం, రా మెటీరియల్ను రాకుండా చేసి నష్టాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంగురి చేసినది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అదాని కి కట్టబట్టేందుకు కుటిల ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 810 రోజుల నుండి ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు నిరవధిక ఆందోళన , దీక్షలను చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్రాలల్లో అధికారంలో ఉన్న రెండు ప్రభుత్వాలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉండడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సిఐటియు ఇతర కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చాయన్నారు . ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా ఆపి ప్రభుత్వం ఆధీనంలోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడపాలని సిపిఎం, సిఐటియు రూరల్‌ కమిటీలుడిమాండ్‌ చేస్తున్నాయి. లేనియెడల రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలనుకలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌ , సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్లాడి గోపాల్‌ , కే .పెంచల నరసయ్య, సిఐటియు రూరల్‌ అధ్యక్షులు కొండా ప్రసాద్‌, సిఐటియు కార్యదర్శివర్గ సభ్యులు దేవతాటి సంపత్‌ కుమార్‌, ఈఎస్‌ బాబు, నందిపాటి మాలకొండయ్య, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ రూరల్‌ అధ్యక్షులు కె.శ్యాంసన్‌, శాఖ కార్యదర్శులు వెంకీ, ఎస్‌కె కాలేషా, ఆర్‌వి.రావు, ఎస్‌కె షాన్‌వాజ్‌, కె.మల్లికార్జున, ఆటో వర్కర్స్‌ నాయకులు మౌలాలి, సుబ్బయ్య, గ్యాస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చిట్టిబాబు , బాలాజీ, వేలంగిణి రాజా, వెంకటస్వామి, ఆవాజ్‌ రూరల్‌ నాయకులు ఎస్‌కె బాషా, ఎస్‌కె గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.