Mar 28,2022 22:20
  • మూతపడిన షాపులు - బోసిపోయిన ఆర్‌టిసి కాంప్టెక్స్‌ - 127 మంది అరెస్టు
  • 'ఉక్కు' ప్రైవేటీకరణ అడ్డుకుంటాం : సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం నిర్వహించిన విశాఖ జిల్లా బంద్‌ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసితోపాటు వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు (బిజెపి మినహా) తలపెట్టిన ఈ బంద్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వ్యాపార, వాణిజ్య వర్గాల వారు తమ షాపులను, సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి సంపూర్ణమద్దతు తెలిపారు. విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లోనిదుకాణాలు తెరుచుకోలేదు. బంద్‌, సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదావేసుకోవడంతో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వెలవెలబోయింది. మధ్యాహుం వరకువాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మనుపాలెం జంక్షన్‌లో భారీ మానవహారం చేపట్టారు. బంద్‌, సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎక్కడికక్కడే బ్యానర్లు, ప్లకార్డులతో వామపక్షాలు, ప్రజాసంఘాలు నాయకులు ఉదయం ఐదు గంటలకే రోడ్లపైకొచ్చారు. మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆట, పాటలు, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ సహా 127 మందిని పోలీసులు అరెస్టు చేసి ఎంవిపి, త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్లకు తరలించారు. మధ్యాహుం మూడు గంటల తరువాత వారిని విడుదల చేశారు. విశాఖ మన్యం, గ్రామీణంలోనూ బంద్‌ జయప్రదమైంది. పర్యాటక ప్రాంతాలైన బర్రా గుహలు, కటిక తాడిగుడ, చాపరాయి, రణజిల్లెడ, జలపాత ప్రాంతాలు, అరకుట్రైబల్‌ మ్యూజియం, కాఫీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ మూతపడ్డాయి. అనంతగిరి, పెదబయలు మండల కేంద్రాల్లో వారపు సంతలు జరగలేదు. పరవాడ మండలంలోనిఎన్‌టిపిసి పరిశ్రమ ఎదుట కార్మికులు మానవహారం నిర్వహించారు. బంద్‌ సందర్భంగా ఎంవిపి పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీవ్వబోమనాురు. పోరాటాల ద్వారా అడ్డుకుంటామనిపేర్కొనాురు. రాష్ట్రంలో కృష్ణపటుం, గంగవరం పోర్టులను కార్పొరేట్‌ అయిన అదానీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు గతంలో జరిగిన పోరాటాలకురాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించేది. ఈసారి మద్దతు ఇచ్చినా అరెస్టులు చేయించడం దారుణమన్నారు. 'ఉక్కు' ఉద్యమానికి నష్టం చేసేలా, విశాఖ స్టీల్‌ను అమ్మాలను మోడీ నిర్ణయానికి వత్తాసు పలికేలా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.

విశాఖ బంద్‌ స్వచ్ఛందం, సంపూర్ణం

విశాఖ బంద్‌ స్వచ్ఛందం, సంపూర్ణం

విశాఖ బంద్‌ స్వచ్ఛందం, సంపూర్ణం