May 07,2023 22:26

కిట్టన్న మృతదేహాన్ని వెలికి తీస్తున్న స్థానికులు

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు, చేపల వేటకు వెళ్లి మరో వ్యక్తి మృతి చెందారు. రాజంపేట మండలం ఊటుకూరు చెరువులో యువకులు, పెద్దతిప్పసముద్రం మండలంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. - ఊటుకూరు చెరువులో ఇద్దరు యువకులు మతి
- ఒకరి మతదేహం లభ్యం, మరొకరి - కోసం గాలింపు చర్యలు
-చెరువులో పడి మరో వ్యక్తి మృతి
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ / బి. కొత్తకోట
ఈత సరదా రెండు ప్రాణాలను బలిగొంది. పాలిటెక్నిక్‌ పూర్తి చేసి భవిష్యత్తుపై కలలుగంటున్న యువకుడు ఒకరైతే.. కడప ఆర్డీవో కార్యాలయంలో తండ్రి స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడు మరొకరు. స్నేహితులతో కలిసి సర దాగా నలుగురు యువకులు ఆదివారం మధ్యా హ్నం మండల పరిధిలోని ఊటుకూరు చెరువులోకి ఈతకు వెళ్లారు. కార్తీక్‌, హేమంత్‌ అనే యువకులు ఒడ్డున ఉండగా యశ్వంత్‌ కుమార్‌ (23), ధనుష్‌ (20) ఈతకు వెళ్లారు. చెరువులో అక్కడక్కడా గుంతలు ఉండడంతో అక్కడే ఈత కొడుతూ లోతు ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లారు. కొద్ది సేపటికి వారు మునిగిపోయి గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు హుటా హుటినా అర్బన్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో యశ్వంత్‌ కుమార్‌ మతదేహాన్ని వెలికి తీశారు. ధనుష్‌ మతదేహం కోసం గాలింపు చర్యలు చేపడు తున్నారు. మృతుడు పాలిటెక్నిక్‌ చేశాడు. తండ్రి మరణించడంతో తల్లి ఓ ప్రయివేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ కుమారుడికి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన ధనుష్‌ పట్టణంలోని గంగిరెడ్డిపాలెంలో ఉంటూ కడప నగరంలోని ఆర్‌డిఒ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహించేవాడు. రోజూ రాజంపేట నుంచి కడపకు వెళ్లి వచ్చేవాడని, ఆదివారం సెలవు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధనుష్‌ మతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
చెరువులో పడి వ్యక్తి మతి
చెరువులో పడి వ్యక్తి మతి చెందిన సంఘటన పెద్దతిప్పసముద్రం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు పిటిఎం మండలం పులికల్లు సమీపంలో చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారం అందించగా వారు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని వెలికి తీశారు. మతుడు హరిజనవాడకు చెందిన మిట్టపల్లి కిట్టన్న (45)గా గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి చేపల వేటకు వెళ్లి మతి చెందాడా లేక ఇతర కారణాల చేత చనిపోయాడా అనే విషయాలు పోలీసులు విచారిస్తున్నారు.