Mar 06,2023 19:28

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు, కమిటీ సభ్యుల నిరంతర పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరేడు గ్రామ వాస్తవ్యులు సోమవారం పేరూరి సత్యనారాయణ భార్య జయలక్ష్మి కందుకూరు ఆలయాన్ని దర్శించి అభివద్ధి కార్యక్రమాలు చూసి తన వంతుగా రూ.5,116లు విరాళంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు యెనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. మాదాల మాల్యాద్రి, ఆలయ పూజారి పాల్గొన్నారు.