Feb 04,2023 19:57

విరాళం అందిస్తున్న దాత

ప్రజాశక్తి -కందుకూరు : అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ సభ్యుల నిరంతర పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆలయ నిర్మాణం కోసం అమ్మవారి పాదాల చెంత ఉంచే సువర్ణ యంత్రానికి శనివారం ప్రకాశం జిల్లా దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ గ్రంధి మాధవి, నిడమనూరి రామకష్ణ భార్య మాధవి ఒక గ్రామ బంగారానికి గాను రూ.5505లు నగదు రూపంలో అమ్మవారికి కానుకగా నిర్మాణ కమిటీ సభ్యులు యెనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మాదాల మాల్యాద్రి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.