Jan 17,2023 19:28

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని అంకమ్మ తల్లి ఆలయ పునర్‌ నిర్మాణం కోసం శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. మంగళవారం ఆలయ నిర్మాణానికి గొల్ల శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి రూ.25,116లు విరాళంగా సంక్రాతిని పురస్కరించుకుని నిర్మాణ కమిటీ సభ్యులుకి అందజేశారు. యెనిమిరెడ్డి వెంకటరెడ్డి, దివి లింగయ్య నాయుడు, మాదాల మాల్యాద్రి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అదేవిధంగా కీర్తిశేషులు ఆముదాలపల్లి కొండయ్య భార్య అచ్చమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్ళు మనుమడు మాల్యాద్రి భార్య సుబ్బరత్నం, వెంకటేశ్వర్లు భార్య నాగేంద్ర, మాధవరావు భార్య విజయలక్ష్మి కుమారుడు శివరామ ప్రసాదు కలసి రూ.51,116లు విరాళంగా నిర్మాణ కమిటీ సభ్యులు అందజేశారు. యెనిమిరెడ్డి వెంకటరెడ్డి, మంచిరాజు మురళి, మాదాల మాల్యాద్రి పాల్గొన్నారు.