విరాళం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు శ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల, భక్తుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆలయ నిర్మాణానికి అమ్మవారి భక్తులు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా పబ్బిశెట్టి నరశింహస్వామి భార్య విజయలక్ష్మమ్మ ల జ్ఞాపకార్థం వారి కుమారుడు పబ్లిశెట్టి వరదరాజ భార్య కమల వారి కుటుంబ సభ్యులు నాగ వెంకట దివ్యశ్రీ, సాయి శ్రీజ, పవన్ కుమార్ రూ.25116లు విరాళాన్ని శాసనసభ్యులు మహీధర్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు తలపనేని వెంకటేశ్వర్లు, కొడాలి కోటేశ్వరరావులకు అందజేశారు.










