ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి, భక్తుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అమ్మవారి పాదాల చెంత ఉంచి సువర్ణ యంత్రానికి భక్తులు తమవంతు బంగారాన్ని అమ్మవారికి విరాళంగా సమర్పిస్తున్నారు. కందుకూరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ మురారి శెట్టి మోహన్ భార్య వెంకటరత్నం రూ.5716లు, కనిగిరికి చెందిన ఓలేటి మురళీకష్ణ భార్య వెంకట సుహాసిని రూ.5716లు, పీసీ పల్లికి చెందిన కందనూరు శ్రీకాంత్ భార్య విష్ణుప్రియ రూ.5716లు, నెల్లూరుకి చెందిన కాళంగి వెంకటేశ్వర్లు భార్య అంజలీదేవి రూ.5716లు మొత్తము కలిపి రూ.22,864లు విరాళంగా ఎంఎల్‌ఎ మానుగుంట మహిధర్ రెడ్డి సమక్షంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు.










