ట్యాబ్‌లు అందజేస్తున్న దృశ్యం
వి.పి.ఆర్ విద్యా పాఠశాలలో ట్యాబ్‌లు పంపిణీ
నెల్లూరు :రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారధ్యంలో, వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వి.పి.ఆర్ విధ్య ( ఇంగ్లీషు మీడియాం) పాఠశాలలో మంగళవారం 8 వ తరగతి విధ్యార్ధులకు ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, వి.పి.ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,అధ్యక్షురాలు, స్థానిక సలహా కమిటీ, ఎస్‌వి దేవస్థానం , న్యూడిల్లీకి చెందిన ఉత్తర భారత దేశ తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని విద్యార్ధులకు ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వి.పిఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ ఎడ్యుకేషన్ వైపుకు రాష్ట్ర విద్యా వ్యవస్థను నడిపించడానికి సిఎం కృషి చేయడం అభినందనీయమన్నారు. అందులో భాగంగానే విద్యార్ధులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నారన్నారు. అదే విధానాన్ని మన పాఠశాలలోను ప్రారంభించాలన్న ఆలోచనతో 8 వ తరగతికి చెందిన 30 మంది విధ్యార్ధులకు ట్యాబ్ లను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ 8 వ తరగతి విధ్యార్ధులకు ఈ సదవకాశం ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సాంకేతిక విద్యను శాస్త్రయుక్తంగా వినియోగించుకొని విద్యార్దులు అభివద్ధి సాదించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సి.ఈ.ఓ, వి.టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు బందం పాల్గొన్నారు.










