ప్రజాశక్తి-హిందూపురం : వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తహశీల్దార్ ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సువర్ణ భారతీ జూనియర్ కళాశాల, ఎంజిఎం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా తహశీల్దార్‌తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారిణి హరతి, తూనికల కొలతల శాఖ ఇన్స్‌పెక్టర్ శివశంకర్ మాట్లాడుతు వినియోగదారుల హక్కులు, బాధ్యతల పట్ల చైతన్యం కల్పిస్తున్నామన్నారు. వినియోగదారులు ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ విషయంలో వారు చైతన్యవంతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, స్టోర్ డీలర్లు, విద్యార్థులు, ఆయా కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










