Dec 30,2022 20:22

ఫొటో : శిలాఫలకాన్ని పరిశీలిస్తున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు

విమానాశ్రయ భూములు పరిశీలన

ప్రజాశక్తి-దగదర్తి : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన మన రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని దామవరంలో గ్రీన్‌ ఫీల్‌ విమానాశ్రయం కోసం సేకరించిన భూములను శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో దామవరంలో విమానాశ్రయం కోసం సరిపడా భూములున్నాయని, నేల కూడా అనుకూలంగా ఉండడంతో అంతేగాక ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో దామవరంలో విమానాశ్రయం నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. విమానాశ్రయాన్ని కందుకూరి సమీపంలో నిర్మిస్తున్నారని చెప్పడం సైకో పరిపాలనకు నిదర్శనమని తెలిపారు. అంతేగాక కృష్ణపట్నం పోర్టులో పేపర్‌ పరిశ్రమను నిర్మించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చాయని తెలిపారు. దీనివల్ల అనేకమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉండేవన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు నిర్మించేందుకు ముందుకొచ్చిన పరిశ్రమవేత్తలు వెనక్కి వెళ్లిపోవడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మిగిలిపోయారన్నారు. ఈ పరిపాలన చూస్తే సైకో పరిపాలనగా ఉందిని ఎద్దేవా చేశారు. ఈ సైకో పరిపాలన పోవాలంటే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. మీరందరూ సహకరిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కావలి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, దగదర్తి మండల నాయకులు మాలపాటి రవీందర్‌ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.