ప్రజాశక్తి-హిందూపురం : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య (ఆర్చరీ పోటీల్లో) పోటీల్లో హిందూపురం పట్టణానికి చెందిన కెపి. హరీష అండర్ 17 విభాగంలో ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు బోపాల్‌లో జరిగిన ఈ పోటీల్లో రాణించిన హరీష రాజస్థాన్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనిష్‌కుమార్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నట్లు వివరించారు. పట్టణంలోని మెయిన్ బజారులో వాయిపుత్ర జువెలర్స్ నిర్వహుకులు కుంచం ఫణిరాజ్, సహన దంపతుల కుమార్తె హరీష ప్రస్తుతం బెంగళూరులోని న్యూ బాల ఇంటర్నేషనల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోందన్నారు. హరీష ఆర్చరీలో జాతీయ స్థాయి పోటీల్లో బంగారుపతకం సాధించటంపై పట్టణానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.










