రాయచోటి టౌన్ : కోడూరు నియోజకవర్గంలోని విక్టరీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. గురువారం ఎడి నరసింహులుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విక్టరీ విద్యా సంస్థలు ఫీజుల రూపంలోనేగాక పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. జీవో నంబర్ 1 ప్రకారం పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్ విక్రయించరాదనే నిబంధన ఉన్నప్పటికీ విక్టరీ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి విద్యార్థుల తల్లితండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ వేలాది రూపాయిలు వసూలు చేస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ దష్టిలో ఉంచుకుని విద్యాశాఖధికారులు జీవో నెం.1 పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రయివేట్ పాఠ శాలలు సామాన్య విద్యార్థులకు విద్యను అందని దాక్షలా తయారు చేస్తున్న తరు ణంలో విద్య అందరికి అందించాలనే ఉద్దేశంతో ఫిజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చిందని, కార్పొరేట్ , ప్రయివేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన టువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంల ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రతి జిల్లాకూ డిఎఫ్‌ఆర్‌సి నియమించిన కమిటీలు కమిటీలకే పరిమితమయ్యాయే తప్ప ఎలాంటి మార్పు తీసుకురాలేదని మండి పడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేలుకొని జిల్లాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుపరిచి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమానికి కార్యచరణ చేస్తామని హెచచరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాయచోటి పట్టణ కార్యదర్శి నరేష్, మల్లికార్జున, కార్తీక్, రమణ పాల్గొన్నారు.










