Mar 03,2023 22:30

ఫొటో : పెట్రోల్‌ పోసుకుంటున్న మండవ వెంకట్రావు

వికలాంగుల కాలనీలో నిర్మాణాలు ఆపాలి
- వికలాంగుడి ఆత్మహత్యయత్నం
- స్పందించని అధికారులు
ప్రజాశక్తి-కావలి : వికలాంగుల కాలనీలో అక్రమ కట్టుబడులు ఆపాలని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట వికలాంగులు ధర్నా చేస్తుంటే, తహశీల్దారు స్పందించక పోగా కార్యాలయం తలుపులు మూయించాడు. అందుకు నిరసనగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి శుక్రవారం తహశీల్దారు కార్యాలయం ఎదుట తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని కాల్చుకునేందుకు సిద్ధపడ్డాడు. సమీపాన ఉన్న వికలాంగులు తమ నాయకుని ప్రయత్నానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా మండవ వెంకట్రావు మాట్లాడుతూ శుక్రవారం కూడా వికలాంగుల కాలనీలో అక్రమంగా కట్టుబడి చేస్తున్నారని తెలిపారు.
ఫొటోలు తియడానికి పాయినవరినీ తిడుతున్నారన్నారు. వి.ఆర్‌.ఒ., పోలీస్‌ వారు ఆపమన్నా అక్రమ కట్టుబడి సాగుతూనే ఉందని తెలిపారు. వికలాంగుల స్థలాల్లో నిర్మించే అక్రమ కట్టడాలను తక్షణమే నిలిపి వేయాలని, నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించకపోతే వికలాంగులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు.