Mar 02,2023 19:01

వికలాగుల పాఠశాలకు సాయం ఆందిస్తున్న దాతలు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు కోవూరు రోడ్డులోని స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల పాఠశాలలో లింగసముద్రం గ్రామానికి చెందిన పూడిమెట్ల కోటయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా కుమారులు గోపి, శ్రావణ్‌, ప్రశాంత్‌ ,చిన్నరాయుడు వారి కుమార్తె చైతన్య అల్లుడు లక్ష్మీనరసింహం పాఠశాలకు ఆర్థిక సాయం, వస్తు సాయాన్ని అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలకు 125 కేజీల బియ్యంతో పాటు రూ. 10 వేల నగదును విరాళంగా అందజేశారు. మానసిక వికలాంగుల పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్కూల్‌ కరస్పాండెంట్‌ ఎస్‌ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.