ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
విజయవాడ నగరంలో మిస్ ఇండియా మానసా వారణాసి సందడి చేశారు. బందరురోడ్డులోని పివిపి మాల్ లో కమల్ వాచ్ షోరూం రీ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన షోరూం ను 2021 మిస్ ఇండియా మానసా వారణాసి లాంచనంగా ప్రారంభించారు.అనంతరం షోరూం లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వాచ్ లను ఆమె పరిశీలించారు వాటి ధరల వివరాల్ని అడిగితెలుసు కున్నారు.30లక్షల రూపాయలు విలువ చేసే వాచ్ ను ధరించి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లడుతూ వాచ్ ను ప్రతి ఒక్కరూ ధరిస్తారనీ ముఖ్యంగా పిల్లలు నుంచి పెద్ద వారు వరకు వాచ్ ను ఇష్టపడని వారుండరు అని అన్నారు. మహిళలు, విద్యార్థినులు, జాబ్ కు వెళ్ళే వారు ఖచ్చితంగా వాచ్ ను ధరిస్తారనీ తెలిపారు. వాచ్ చేతికి ఒక ఆభరణంగా ఉంటుందని పేర్కొన్నారు. షోరూం నిర్వాహకులు డి.వేణుగోపాల్ తోత్ల మాట్లాడుతూ ఒడిస్సా,తో పాటు తెలుగు రాష్ట్రాలలో తమకు 45 బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్స్ వాచ్ లను నగర వాసులకు పరిచయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తమ వద్ద రాడో, టిస్సొట్, మొరాడి, హార్మొనీ, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలతో పాటు అనేక రకాల వాచ్ లు అందుబాటులో ఉన్నాయని వివరించారు తమ షోరూం లో 500 రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన వాచ్ లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం పార్టనర్ సిద్ధాంత్ తోత్ల ,సిబ్బంది పాల్గొన్నారు.










