Apr 27,2022 14:56

విజయవాడ : ముస్లిం సమస్యలపై విజయవాడ వన్ టౌన్ నెహ్రూ సెంటర్ లో ధర్నాకు జనసేన నేత పోతిన మహేష్ పిలుపునివ్వడం ఉద్రిక్తలకు దారి తీసింది. స్థానిక జనసేన కార్యాలయం వద్ద పోతిన మహేష్ ను  పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఎం గో బాక్... గో బాక్ అంటూ జనసేన సైనికుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముస్లిం సమస్యలపై ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లింల పరిస్థితి దయనీయంగా మారిందని, ముస్లింల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ముస్లింలకు ఏమి లబ్ది చేకూర్చారని జగన్ ను ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధికి పాటుపడని ముఖ్యమంత్రి జగన్ కు విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చే హక్కు లేదని అన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రీ సర్వే చేయించాలని, ఎమ్మెల్యే వెల్లంపల్లి బినామీల చేతుల్లో ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రక్షించాలని  పోతిన మహేష్ డిమాండ్ చేశారు.