సన్మానిస్తున్న దృశ్యం
విజయ డెయిరీలో సర్వసభ్య సమావేశం
ప్రజాశక్తి-కోవూరు :మండల పరిధిలోని పడుగుపాడు గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్(నెల్లూరు విజయ డెయిరీ) సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కష్ణమోహన్ అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పాడి రైతులకు మేలు చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సహకారంతో నెల్లూరు విజయ డెయిరీని లాభాలబాటలో ముందుకు తీసుకెళ్లేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామన్నారు. విజయ డెయిరీ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన కొండ్రెడ్డి రంగారెడ్డిని రైతులు, సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం 10 డైరెక్టర్ పదవుల్లో మూడు ఖాళీగా ఉండగా వాటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ డైరెక్టర్లు సీహెచ్ కష్ణారెడ్డి, సుబ్భ రాయుడు, భవానీరెడ్డి, ఎన్. దశరదరామిరెడ్డి, సునీల్ రెడ్డి, హరిచంద్రరెడ్డి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.










