ఫొటో : మాట్లాడుతున్న వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న దృశ్యం
విజ్ఞాన నిలయం గ్రంథాలయం
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రతిఒక్కరి జీవితంలో వెల కట్టలేనిది విద్య అని సర్పంచ్ షేక్ బీబీజాన్ అభిప్రాయ పడ్డారు. స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు సలహాలిచ్చారు. రాష్ట్రప్రభుత్వం విద్యాభివృద్ధికి అమ్మఒడి, విద్యాదీవెన, గోరుముద్ద లాంటి పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా, వేసవి సెలవుల్లో విధ్యార్థుల పఠనాశక్తి, సృజనాత్మక విలువలు పెంపొందించడానికి శిక్షణా శిబిరాలు ఆయనకున్న శ్రద్ధా శక్తులకు నిదర్శనమన్నారు. విద్యారంగంలో అనేక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని అభివృద్ధి చెండాలని ఆశించారు. అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు నారాయణ, శ్రీనివాసులు నాయుడు, తిరుపతినాయుడు పాల్గొన్నారు.










