ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ విజెఎస్‌ఎంఆర్ ఒడిగోస్‌కు రీజినల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌గా గుర్తింపు లభించింది. స్థానిక రమణయ్యపేటలో ఒడిగోస్ కార్యాలయంలో ఈ మేరకు మంగళవారం అభినందన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజెఎస్‌ఎంఆర్ ఒడిగోస్ టెక్నాలజీస్ మేనేజింగ్ పార్టనర్ వార వినోద్ మాట్లాడారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన రీజినల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌గా విజెఎస్‌ఎంఆర్ ఒడిగోస్‌కు గుర్తింపు లభించిందన్నారు. ఈ గుర్తింపు ద్వారా నిరుద్యోగులకు మరిన్ని మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. సివైఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తి రాజు సర్టిఫికెట్ ను ఆవిష్కరించారు. మేరీ జ్యోతి, ఉషారాణి, నాని శిరీష, కుమార్, మౌలిక, వర్ష, విజరు పాల్గొన్నారు.










