ప్రజాశక్తి -పొదలకూరు :క్రీస్తు శేషులు కాకాణి రమణారెడ్డి స్మారకార్థం, స్థానిక వినాయక షటిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగిన ఐదు జిల్లాల స్థాయి ఓపెన్ క్యాటగిరి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పొదలకూరు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ, తతీయ స్థానాలను గూడూరు, తిరుపతి జట్లు నిలిచాయి. చతుర్ద స్థానాన్ని గూడూరు జట్టు సాధించింది. వెటరన్ 40 ప్లస్ విభాగంలో మొదటి నాలుగు స్థానాలను గూడూరు, నెల్లూరు, పొదలకూరు జట్లు గెలుచుకున్నాయి. వెటరన్ 50 ప్లస్ విభా గంలో ప్రధమ, ద్వితీయ, తతీయ, చతుర్ధ స్థానాలను నెల్లూరు, పొదలకూరు జట్లు సాధించాయి. విజేతలకు వినాయక షటిల్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఊకోటి లక్ష్మీనారాయణ, బీపీ నారాయణరెడ్డిలు బహుమతులను అందజేశారు. ముగింపు సమావేశంలో పొదలకూరు ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, వినాయక షటిల్ క్లబ్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.










