ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : బ్రహ్మోత్సవాల నిర్వహణతో దక్షిణ కాశీగా పేరుపొందిన రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయ ఖ్యాతి మరింత పెంపొందాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆలయ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి విజయతో కలసి శ్రీకాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవకులు, దాతల సహకారం, సమన్వయంతో బ్రహ్మోత్సవాలును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఇఒ రమణారెడ్డి, కమిటీ సభ్యులు సురేష్, రత్నశేఖర్‌రెడ్డి, నాగభూషణం, సర్పంచ్‌లు రామాంజులు, నాగార్జున ఆచారి, నాయకులు చలమారెడ్డి, రఘు పాల్గొన్నారు.










