Jul 10,2021 12:12

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంలో వీర సైనికుడు జశ్వంత్‌ రెడ్డి భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని, జెసి దినేష్ కుమార్ తదితరులు జశ్వంత్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్ ను హోంమంత్రి అందచేశారు. అతి చిన్నవయస్సులో జశ్వంత్‌ మరణించడం చాలా బాధాకరమనీ హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం జశ్వంత్‌ రెడ్డి చేసిన త్యాగం మరువలేనిదన్న హోంమంత్రి సుచరిత చెప్పారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన జశ్వంత్‌ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.