Mar 12,2023 21:42

విహార యాత్రలో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని సంస్కతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విహారయాత్రకు వెళ్లారు. వెంగమాంబ దేవస్థానం, సిద్ధేశ్వరం, బైరవకోనను విద్యార్థులు సం దర్శించారు. ఈ విహారయాత్ర కార్యక్రమాన్ని పాఠశాల ఛైర్మన్‌ కోంకా చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు మానసిక వికాసానికి తోడ్పడతాయని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్‌ మన్నెం యల్లయ్య నాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పువ్వాడి శ్రీనివాసులు, ఎఓలు రాజేష్‌, మోహన్‌ రావు, రబ్బాని, పీఈటి కోటేశ్వరరావు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.