Jan 10,2023 21:09

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిని ఇస్తున్న వడ్డెర్లు

        హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం శ్రీకంఠపురంలో భారత స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలని వడ్డెర సంఘం నాయకులు కోరారు. మంగళవారం ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ ప్రసాద్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని వీరోచిత పోరాటం చేసిన వీరుడు అన్నారు. వడ్డెర జాతి కోసం ఎంతో కషి చేసిన ఓబన్న విగ్రహం హిందూపురంలో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు రంగప్ప, ప్రసాద్‌, నాగరాజ్‌, వెంకటేష్‌ కోట, అక్కులప్ప, దుర్గ నవీన్‌, శ్రీనివాసులు, గంగప్ప, శివగోవింద్‌, సునీల్‌ కుమార్‌, గురుశంకర్‌, రాజా, వంశీ, చిన్న పాల్గొన్నారు.