ప్రజాశక్తి -వెంకటాచలం : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కి ఎడ్యుకేషన్ స్కిల్స్ , ఇంటెన్షిప్ పై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ సచి వులు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటెన్షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను స్కిల్ ఓరియెంటెడ్ గా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం ా భావించాలని తెలిపారు.ఉన్నత విద్యా మండలి అకడమిక్ కన్సల్టెంట్ డాక్టర్ సివిఎస్ భాస్కర్ , టెక్నికల్ కోఆర్డినేటర్ దినేష్ ఇ డి యు స్కిల్ టీమ్ మెంబర్స్ దీక్షిత , శివకుమార్ మరియు నోడల్ ఆఫీసర్ అనిల్ , యూనివర్సిటీ బి సి డి ఇ కోఆర్డినేటర్ ఎ. జ్యోత్స్న పాల్గొన్నారు.










