విధులు సక్రమంగా నిర్వర్తించాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండల పరిధిలోని విధులు నిర్వహించే వైద్య ఆరోగ్య సిబ్బంది తమవంతు బాధ్యతగా వ్యవహరించాలని వైద్య అధికారిని కరిష్మా అన్నారు. శుక్రవారం విరువూరు ఎస్‌సి కాలనీ ఎలిమెంటరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తమ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వైద్య సేవలు అందించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే నిష్పక్షపాతంగా ఇంటింటి సర్వే చేపట్టి నివేదికను వైద్యశాలలో అందజేయాలన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యలను కాపాడుకోవాలని తెలిపారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంభించిన చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నివాసాలను సైతం సందర్శించి ప్రస్తుత సీజన్లో సంబంధించి వ్యాధుల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ రాజశేఖర్, ఎఎన్‌ఎం సరస్వతి, ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఆశ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










