విధుల్లో నిర్లక్ష్యం వీడాలి : ఎంపిడిఒ
ప్రజాశక్తి-ఉదయగిరి : సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యం వాడాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ తెలిపారు. మంగళవారం స్థానిక బిట్ -3 సచివాలయంలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తప్పనిసరిగా 100శాతం హాజరు వేసి 10:30 లోపల సచివాలయాలలో విధులకు హాజరు కావాలని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ పథకాల సర్వేలు 100శాతం పెండింగ్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యాహరిస్తే చర్యలు తప్పవని సూచించారు. హౌసింగ్‌కి సంబంధించిన లిస్టులు గ్రామ వాలంటీర్ల వారీగా ఇచ్చి, వారు ఇల్లు త్వరగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఖాదర్ కరిముల్లా, మండల కో ఆర్డినేటర్ గాజుల ఇమ్రాన్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










