విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
- డివిజన్ స్థాయిలో ఆరోగ్య సిబ్బందితో డిఎం అండ్ హెచ్‌ఒ సమీక్ష
న్రపజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని అందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని అయితే కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని అలా నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయక తప్పదని ఫ్యామిలీ డాక్టర్ పథకం జిల్లా ఇన్‌ఛార్జి దయాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని డివిజన్ స్థాయి మండలాల పిహెచ్‌సి డాక్టర్లు సిబ్బంది ఎఎన్‌ఎంలు, సూపర్వైజర్లతో డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎం.పెంచలయ్యతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముందుగా మండలాల పిహెచ్‌సి డాక్టర్లతో వారి విధుల గురించి తెలుసుకొని నమోదు చేస్తున్న రికార్డులను తీసుకొని కావాలని కోరారు అనంతసాగరం పిహెచ్‌సి డాక్టర్‌తో పాటు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం ఏ ఒక్క రికార్డు సక్రమంగా నమోదు చేయకపోయిన విషయాన్ని గుర్తించిన ఆయన వారిపై మండిపడ్డారు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం నిర్థేశించిన ఆరోగ్య పథకాలను నిర్లక్ష్యంతో తుంగలో తొక్కుతున్నారని ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పట్టించుకునే పరిస్థితిలో లేరని సస్పెండ్ చేయక తప్పదన్నారు. గతంలో పోలిస్తే పిహెచ్‌సి కేంద్రాల సంఖ్య పెరిగిందని, దీంతో ఆయన పిహెచ్‌సిల పరిధిలో జనాభా సైతం తగ్గే విధుల్లో ఒత్తిడి లేకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఎలా వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎఎస్‌పేట పిహెచ్‌సి సిబ్బంది సైతం విధులపై జాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండడం ఏ ఒక్క రికార్డు పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడం ఎన్‌సిడి సర్వే ఏడాదిన్నర క్రితమే మొదలుపెట్టిన దాని వివరాలు అందించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామన్నారు. డాక్టర్ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ ఎం పెంచలయ్య మాట్లాడుతూ డివిజన్ పరిధిలో పది మండలాలు పిహెచ్‌సిల సిబ్బందికి ముందుగానే సమాచారం ఇచ్చి రికార్డుల డైరీ తీసుకుని రావాలని సూచించిన పట్టించుకోకుండా సమీక్షలకు రావడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడంలో మెరుగైన వైద్యసేవలు అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో నెల్లూరు జిల్లా ఉందని అలాంటి మంచి పేరును చెడిపోకుండా పిహెచ్‌సిల సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక డాక్టర్‌తో పాటు సిబ్బంది 72 రకాల మందులు వారి వెంట తీసుకొని ముఖ్యమైన పరీక్షలు సైతం నిర్వహిస్తూ వైద్య సేవలు అందించేలా ప్రోగ్రాం రూపొందించినట్లు తెలిపారు. రెండవసారి కాన్పులు అయ్యే వారికే కాన్పులు చేయాలని సూచించినట్లు అన్ని వసతులు ఉండటంతో అక్కడకు కాన్పులకు వచ్చేవారిని పంపాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని పిహెచ్‌సిలో ముగ్గురు స్టాఫ్‌నర్సులు నియమించినట్లు ఎంపిక చేసిన పిహెచ్‌సిలు 24 గంటలు రోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆత్మకూరు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటకృష్ణ, అన్ని మండలాల పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










