Mar 03,2023 22:25

ఫొటో : మాట్లాడుతున్న మెప్మా పీడీ రవీంద్ర

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : ఆర్‌పిలు వారివారి విధులు సక్రమంగా నిర్వహించాలని లేనిపక్షంలో వారిపై చర్యలు తప్పవని మెప్మా పీడీ రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మెప్మా కార్యాలయంలో అన్ని బ్యాంకు మేనేజర్లు సిఎంఎం, సిఒఎస్‌ ఆర్‌పిలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మెప్మా పీడీ రవీంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమేష్‌ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రయారిటీ అయిన టిడ్కో గృహ నిర్మాణానికి సంబంధించి లోనింగ్‌ ప్రాసెస్‌ చేయడం కోసం ఇప్పటికే బ్యాంకు మేనేజర్లు అందరూ కూడా మంచి పురోగతి ఇచ్చారని తెలిపారు.
దాంతోపాటు ఇంకా మనకు 42 అప్లికేషన్లు వివిధ బ్యాంకులలో పెండింగ్లో ఉన్నాయని, వాటికి కూడా 15వ తేదీ లోపల ప్రాసెస్‌ చేయడం కోసం ఈ రివ్యూ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆత్మకూరు విషయానికొస్తే అంతా ప్రోగ్రెస్‌ బాగుందన్నారు. ఇంకా ఉన్న బ్యాలెన్స్‌ వాటిని కూడా త్వరితగతన పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో సిఎంఎం అంకయ్య, టిఎల్‌ఎఫ్‌ ప్రమీల, సివోస్‌ మాధవి, అబిద్‌ బేగ్‌, అన్ని బ్యాంక్‌ మేనేజర్లు ఆర్‌పిలు పాల్గొన్నారు.