Jan 20,2023 21:30

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి

బత్తలపల్లి : మండలంలోని 11 గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావాలని ఎంపిపి గుర్రం వనజ, ఎంపిడిఒ సాయిమనోహర్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని తంబాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విధుల్లో భాగంగా బయటకు వెళ్లినప్పుడు మూమెంట్‌ రిజిస్టర్‌లో తప్పనిసరిగా రాయాలన్నారు. అంతేగాకుండా ఉద్యోగులందరూ సమన్వయంతో, ఐక్యతతో పని చేయాలన్నారు. కాగా ఓటరు జాబితాలో ఆధార్‌ నెంబర్‌ నమోదు ఎంత వరకు వచ్చిందని బిఎల్‌ఒలను అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా ఎవరి ఓట్లును తొలగించవద్దన్నారు. రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నవారు ఉంటే వారు ఎక్కడ ఉంచుకుంటారో తెలియజేసి తొలగించాలని సూచించారు. మండలంలో రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య అధికంగానే ఉందన్నారు. ఈ సమావేశంలో సర్పంచు సానే జయచంద్రారెడ్డి, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, నాయకులు రామ్‌భూపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సండ్రా రామకృష్ణతోపాటు పలువురు నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.