Dec 24,2022 22:10

హాజరు పట్టికను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ ఇంద్రజ

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం మున్సిపల్‌ కార్యా లయంలో అన్ని విభాగాలను పరిశీ లించి, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతు అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదులు చేస్తే వాటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. విధుల్లో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.