Dec 19,2022 22:09

ర్యాలీలో పాల్గొన్న ట్రాన్స్‌కో ఉద్యోగులు

ధర్మవరం టౌన్‌ : విద్యుత్‌ను ప్రతి వినియోగదారుడు పొదువుగా వాడుకోవాలని అనంతపురం రూరల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గోపీ కోరారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా సోమవారం స్థానిక ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌ ఆదాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎడి రామక్రిష్ణ, ధర్మవరం 12 డివిజన్‌ ఎఇలు నాగభూషణం, కొండారెడ్డి, ధర్మవరం రూరల్‌ ఎఇ జానకిరామయ్య, కనగానపల్లి, రామగిరి ఎఇలు మదనమోహన్‌, వెంకటేష్‌, ధర్మవరం జెఎఒలు నారాయణస్వామి, శంకర్‌ నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.