May 05,2022 14:41

గుడివాడ: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి ఇళ్లు దగ్ధమైన ఘటన గురువారం బొమ్మలూరులో చోటుచేసుకుంది.గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ముగ్గురు రైతుల ఇల్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 120మినుము బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు.