విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సబ్ స్టేషన్ ముట్టడి
ప్రజాశక్తి-ఉదయగిరి : మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు ఆదేశాల మేరకు పెరుగుతున్న విద్యుత్తు ఛార్జీలపై మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎల్‌ఎ ఆదేశాలు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చెంచలబాబు యాదవ్ సూచనలతో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మండల టిడిపి నాయకులు కార్యకర్తలతో ముట్టడించామన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేసి ఇష్టానుసారంగా బిల్లులు వేయడంతో సామాన్యుడు కట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో బొజ్జ నరసింహులు, రియాజ్, ఓబుల్ రెడ్డి, వెంకటస్వామి, నల్లిపోగు రాజా, నరసింహులు, మా బాషా, మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు, చిన్న బి, మేస్త్రి వెంకటేశ్వర్లు, అలీ, మహిళా అధ్యక్షురాలు అక్కమ్మ, నవాజ్, నరసయ్య, పులిసంందాన్ని, కాంతారావు, వెంగయ్య, అక్రమ్, గడ్డం నాయుడు, ఆబిత్ పిచ్చయ్య, జల్సా బాలకృష్ణ, రామ్మోహన్, శివకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










