ప్రజాశక్తి-నెల్లూరు :ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 2023-24 వ ఆర్థిక సంవత్సరానికి గాను సమర్పించిన ఆర్థిక ఆవశ్యకత, విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈనెల 19వ తేదీ నుంచి ఈ కార్యక్రమం విద్యుత్ భవన్‌లో అధికారులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ శేషాద్రి. బాలచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆన్ లైన్ విధానం జిల్లాలోని అన్ని ఆపరేషన్ డివిజన్ కార్యాలయాలలో నిర్వహించామని తెలిపారు. ఆత్మకూరు డివిజన్ కార్యాలయం నుంచి ఎల్.కష్ణప్రసాద్ , జి.లక్ష్మీపతి వర్చువల్ విభాగంలో ఆత్మకూరు డివిజన్ నుంచి హాజరు కాగా కావలి డివిజన్ నుంచి పి.పెంచలయ్య, నగరం నుంచి ఎమ్. వెంకటేశ్వర్లు ఎల్. విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.వారికి ఇచ్చు సబ్సిడీ కొనసాగించాలని, దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకూడదని బొగ్గు సమద్ధిగా వున్నపుడు ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదని కమిషన్ దష్టికి తీసుకువచ్చారు. సబ్ స్టేషన్ లో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే చేయాలని తెలిపారు. లక్ష్మీపతి మాట్లాడుతూ గహ వినియోగదారులకు టారిఫ్ రేట్స్ తగ్గించాలని కమిషన్ దష్టి కి తీసుకుని వచ్చారు. 30 యూనిట్స్ వరకు కాకుండా 50 యూనిట్స్ కు ఒకే స్లేబ్‌లో బిల్లింగ్ చేయాలన్నారు. పి.పెంచలయ్య మాట్లాడుతూ ట్రూ ఆప్ చార్జీ లను రద్దు చేయాలన్నారు. సెకీ ద్వార కొంటున్న విద్యుత్ ను నిలిపివేయాలని, కష్ణపట్నం థర్మల్ స్టేషన్ ను ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రూ ఆప్ ఛార్జీలను రద్దు చేయాలన్నారు. వ్యవసాయనికి ఉచిత విద్యుత్ 12 గంటలు ఇవ్వాలని ,వ్యవసాయ పంపు సెట్ లకు మీటర్ లను బిగించవద్దని విద్యుత్ పంపిణీ సంస్థల లోటు ప్రభుత్వమే భరించాలని తెలిపారు. ఎల్.విజరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆక్వా ను ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ గా ప్రభుత్వం విభజన చేసిందని, ఏ రైతు కు ఎన్ని హెక్టార్స్ ఉన్నవో మాపింగ్ చేసి సబ్సిడీ అందజేస్తుందన్నారు. అయితే ఈ మాపింగ్ చేయడంలో చాల తప్పులు జరిగాయని, వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ అర్హులందరికీ అందించాలని తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సోమశేఖర్ రెడ్డి,జయకష్ణా రెడ్డి , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ శ్రీధర్, అశోక్ అసిస్టెంట్ ఇంజనీర్స్ శతి, ప్రసన్న , టెలికాం సిబ్బంది పాల్గొన్నారు.










