Dec 19,2022 22:10

విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తున్న డాక్టర్‌ నాగసింధు

ప్రజాశక్తి-హిందూపురం : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వుంటుందని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రముఖ వైద్యురాలు నాగసింధు, ఆడిటర్‌ స్రావ్య చంద్రిక కోరారు. సోమవారం రూరల్‌ మండలం కిరికెర వద్ద ఉన్నా ఎల్‌ఆర్‌జి విద్యాలయంలో ఫౌండర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా పాఠశాల సెక్రేటరి బాలసుందరం, ఎఒ సంజీవరెడ్డిలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నైతిక విలువలతో కూడిన విద్య విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయం చేస్తుందన్నారు. అనంతరం ప్రతిబా కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.