ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్‌డిఒ ఎంఎస్ మురళి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఏడేళ్ల లోపు బాలబాలికలకు ఫుట్‌బాల్, 14 ఏళ్ల లోపు బాల బాలికలకు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. సాయంత్రం జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులతో ఆర్‌డిఒ మురళి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం ఎంపికైన విద్యార్థులతో మాట్లాడుతూ స్థాయిలో కూడా గెలుపొంది రాష్ట్ర స్థాయికి వెళ్లే విధంగా క్రీడాకారులు పెద్ద చూపాలని తెలిపారు. జిల్లా టీంకు ఎంపికైన బాలికల బాల్ బ్యాడ్మింటన్ టీంలో ఎం.కావేరి, ఎన్‌కేత్రీనాడి ప్రవల్లిక, ఏధరణి, ఏ.జైనాబ్, బి.వెంకటలక్ష్మి, టి.పూర్ణిమరెడ్డి, పి.నోమిత, టి.చంద్రముఖి, ఎస్.చందు ప్రియ, టి.జోషిక, ఏ.పల్లవి, ఎస్.చందన, బాలుర టీంలో కేసి.తేజేష్, ఎం.పూర్ణసాయి, పి.జస్వంత్, బి.తరుణ్, ఎస్.ముని జగదీష్, పి.భాను ప్రకాష్, టి.శివ, ఫిక్జాస్ అహ్మద్, వెంకట్, ఎం.ఉస్మాన్, అహ్మద్ షఫీ, యోగేశ్వర్ రెడ్డి, టి.హృదరు, ఎం.మురళి ఎంపికయ్యారు.










