Dec 24,2022 22:09

మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డికి సన్మానిస్తున్న అధ్యాపకులు

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు విద్యతో పాటు డ్రీడల్లోనూ రాణిస్తే గుర్తింపు వస్తుందని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని సప్తగిరి కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం తెలుపుతూ ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ శివశంకర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, టూటౌన్‌ సిఐ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతు విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి కళాశాలకు పేరు ప్రఖ్యాతలను రెట్టింపు చేయాలన్నారు. విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలను అలవాటు చేసుకోవాలన్నారు. కళాశాల ఎంబిఎ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నారాయణరెడ్డి, పాలన అధికారి గంగిరెడ్డి విద్యార్థులకు పలుసూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ఆధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.