Nov 06,2023 23:11

ప్రజాశక్తి-పిఠాపురం, కరప ఈ నెల ఎనిమిదో తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక జూనియర్‌ కళాశాలలో బంద్‌ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్‌ చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోవరాజు, వెంకటేష్‌, చిన్ని, సురేష్‌, సంతోష్‌, బిందు, లావణ్య, వడ్డి కాసులు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సంజరు ఆధ్వర్యాన కరప జెడ్‌పి హైస్కూల్లో జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ పి.బుల్లిరాజుతో కలిసి బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ బుల్లిరాజు మాట్లాడుతూ విభజన హామీల్లో భాగంగా నిర్మిస్తామన్న కడప ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వి.మురళి విద్యార్థులు పాల్గొన్నారు.