Mar 16,2023 21:52

ఫొటో : విద్యాసామగ్రి అందజేస్తున్న దృశ్యం

విద్యాసామగ్రి పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులకు మర్రిపాడు గ్రంథాలయ ఇన్‌ఛార్జి అధికారి నారాయణరావు తన కుమారుడు 11వ వర్థంతి సందర్భంగా గురువారం జిపిడిఒ మమత విద్యా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ప్రతిఒక్కరూ బాగా చదివి మంచిమార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మిదేవి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్త్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో లైబ్రరీ అధికారి నారాయణరావు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం సిబ్బంది, తపాల అధికారి ఖాజారహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.