ట్యాబ్‌లు అందజేస్తున్న ఎంఎల్‌ఎ
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కోవూరు:నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా, అమ్మఒడి, గోరుముద్దతో పాటు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకోసం ట్యాబ్ లను పంపిణీ చేసి, ఉన్నత శిఖరాలని అధిరోహించడమే సిఎం లక్ష్యమని మాజీ మంత్రి. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు. మండలంలోని 8వ తరగతి చదువు తున్న బాలబాలికలకు 678మందికి ట్యాబ్ లు పంపిణీ చేశారు, ఇప్పటికే గడప గడప లో 49వేల ఇళ్లను తిరిగినట్లు చెప్పారు, ఎవరూ కష్టపడి బాగా చదివితే వారికి రాత బాగుంటుందన్నారు. చదువు కోసం భారీగా ఖర్చు పెట్టి ఈ ట్యాబ్ లను సమకూర్చిన దేశంలో జగన్ ఒక్కరేనని అన్నారు.కార్యక్రమం లో డిఎఎబి చైర్మెన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఎఎంసి చైర్మెన్ పచ్చిపాల రాధా కష్ణా రెడ్డి, ఎఎబి చైర్మెన్ ప్రసాద్ రెడ్డి సొసైటీ చైర్మెన్ మల్లికార్జున రెడ్డి, ఎంపీపీ పార్వతి, జెడ్‌పిటిసి శ్రీలత, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి. ఎంపిడిఒ శ్రీహరి. తహశీల్దార్ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.










