రాయచోటి: జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి వినోదం కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేసి సైన్స్ పట్లు ఆసక్తిని చూపాలిని భౌతిక శాస్త ఉపాధ్యాయులు మధుసూధనరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక విజ్ఞాన్ హైస్కూల్‌లో వేసవి వినోద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రాజు రాకెట్ ప్రయోగాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ ప్రయోగానికి అగ్గిపుల్లలు, వాడి పడేసిన రీఫిల్ పెన్ను ఉపయోగించారు. కిందికి నిప్పులు చిమ్ముతూ పైకి రిఫిక్ రాకెట్ దూసుకుపోతూ విద్యార్థులలో ఉత్సాహాన్ని ఆసక్తిని పెంపొందింప చేసింది. జపాన్‌లో రూపొందించిన బుల్లెట్ రైలు యొక్క బౌలింగ్ శాస్త్ర నియమాన్ని ప్రయోగం ద్వారా వివరించారు. ఘన, ద్రవ పదార్ధాలలో విద్యుత్ ప్రసరణ అనే అంశానికి సంబంధించి ప్రయోగాలు చేసి, అందులోని నియమాలను వివరించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి భారతం, రామాయణంలోని నీతి కథలను వివరించారు. అనంతరం ఒరిగామి కళకు సంబంధించి రాజశేఖర్ మెలకువలు చెప్పారు. కార్యక్రమం మే నెల 17వ తేదీ వరకు విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రామయ్య తెలిపారు. కార్యక్రమం జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, రవీంద్రనాధరెడ్డి, శేషారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.










