Mar 21,2023 22:02

విద్యార్థినులకు రాగిజావా పంపిణీ చేస్తున్న హిందూపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు రాగి జావా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనిమున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంద్రజ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంజిఎం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు రాగిజావాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ఇంద్రజ, మండల విద్యాశాఖ అధికారి గంగప్ప, పాఠశాల హెచ్‌ఎం సామ్రాజ్యం మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదువుతున్న పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు సంపూర్ణ పోషకాహారం అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు నౌషాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు లోకనాథ్‌, సురేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు రాగిజావా పంపిణీ చేశారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఎం సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతం జగన్మోహన్‌, జెడ్పీటీసీ అమరావతి, స్థానిక సర్పంచి ఎస్‌ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు
ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని బిఎస్‌ఆర్‌ బాలికల ఉన్నతపాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించే రాగిజావాను ఆర్డీవో తిప్పే నాయక్‌,మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో, కమిషనర్‌ మాట్లాడుతూ వారంలో మూడురోజులపాటు రాగిజావాను విద్యార్థులకు అందిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, 14 వార్డులోని ప్రాధమికపాఠశాలలో కౌన్సిలర్‌ జేసీబీ రమణ, కడప రంగస్వామి, కేతాలోకేష్‌, నీలూరి వెంకటరాముడు నాయకులు చాంద్‌బాషా, రమణారెడ్డి, పాఠశాల హెచ్‌ఎం సంజీవయ్య, 25వ వార్డులోని పాఠశాలలో కౌన్సిలర్‌ మేడాపురం వెంకటేశువిద్యార్థులకు రాగిజావాను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం లు మేరీ వర కుమారి, ఉమాపతి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ బైముతకరమణ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : మండలంలోని ఉప్పర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాగిజావా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎంఇఒ చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, దంపెట్ల సర్పంచి చల్లా కరుణాకర్‌ నాయుడు,ఉపాధ్యాయులు దుస్తాన్‌ వలి, గాయిత్రి, కార్యదర్శి భారతి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎంపిపి చంద్రశేఖర్‌, రొద్దం సర్పంచి రూప చేతుల మీదుగా విద్యార్థులకు రాగిజావాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ కమిటీ ఛైర్మన్‌ సుబ్బారాయుడు, సచివాలయ కన్వీనర్‌ ఆంజనేయులు, రమేష్‌, గిరీష్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పరిగి : జగనన్న గోరుముద్దలో భాగంగా సత్య సాయి ట్రస్ట్‌ సంయుక్తంగా ప్రభుత్వం పాఠశాలలోని విద్యార్థులకు అందజేస్తున్న రాగిజావా పంపిణీ కార్యక్రమంలో ఎంఇఒ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరస్వతి, జెడ్పీటీసీ శ్రీరాములు, సర్పంచి లక్ష్మీదేవిచ శివశంకర్‌చ అధికారులుచ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాగిజావా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌ కుమార్‌, స్థానిక సర్పంచి గంగాదేవి నరసింహమూర్తి, మండల సచివాలయాల కన్వీనర్‌ షేక్‌ ఇమామ్‌ వలి, సచివాల కన్వీనర్‌ వడ్డేఅంజి, స్కూల్‌ చైర్మన్‌ బొంబాయి బాబు, సర్పంచి వేణు, వార్డుసభ్యులు జెర్రీరామాంజి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాదర్‌ వలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసి అనుష, సర్పంచి సంధ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగిజావా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నాగరాజు యాదవ్‌, ప్రధానోపాధ్యాయులు జయప్రద, రఘు తదితరులు పాల్గొన్నారు.