Dec 31,2022 20:05

ఫొటో : విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తున్న కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేసి పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్నారని 20వ వార్డు కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషాద్రి వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి ప్రధానో పాధ్యాయులు శేషాద్రి వాసు చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్లలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తరగతి గదుల్లో చెప్పే పాఠశాలను పిల్లలకు ఇంటికి వెళ్లాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా సులభంగా నేర్చుకోవడానికి సిబిఎస్‌ సిలబస్‌ ఆధారంగా ట్యాబ్‌లోని యాప్‌లో పాఠ్యాంశాలు రూపకల్పన చేశారని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు శేషాద్రి వాసు మాట్లాడుతూ విద్యార్థుల చదువులలో సమానత్వం తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనలు ఎంతో గానో దోహదపడుతుందని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్‌ మల్లికార్జున, ఉపాధ్యాయులు పుల్లయ్య, విద్యార్థులు తదితరులున్నారు.