Jan 29,2023 21:59

ఫొటో : విద్యార్థులకు పత్రాలు చూపుతున్న దృశ్యం

విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని నార్త్‌ మోపూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ఆదివారం విద్యార్ధులకు టాలెంట్‌ టెస్ట్‌పై ప్రతిభా పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ కళాశాల కరెస్పాండెంట్‌ శివకుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గస్థాయిలో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో మొదటి బహుమతి షేక్‌.పర్హనా, ద్వితీయ బహుమతి ప్రత్యూష, తృతీయ బహుమతి అనీష్‌ గెలుపొందారని తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థులకు త్వరలో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.