Jun 04,2023 20:23

విద్యార్థులను సన్మానిస్తున్న లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు

నందలూరు : నందలూరు మండలంలో ఉన్నటువంటి పది ప్రభుత్వపాఠశాలల్లో 2023 సంవత్సరానికి గాను పదవతరగతి పరీక్ష లలో ఉత్తీర్ణులై ఆయా పాఠశాలలో ప్రధమశ్రేణి మార్కులు పొందిన విద్యార్థులను తగురీతిన సత్కరించి భవిష్యత్‌లో మరింత మంది విద్యార్థులు చదువులో ముందుకు రావటానికి ప్రేరణగా ఉండాలని ఆదివారం లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ మన్నెం రామమోహన్‌ ఆధ్వర్యంలో చీఫ్‌ కన్సల్టెంట్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డాక్టర్‌ జయభాస్కర్‌రావు, అధ్యక్షతన ముఖ్య అతిధిగా ధీరజ్‌ కుమార్‌ హాజరై విద్యార్థులు వి.సాయి కీర్తన (పాటూరు జడ్పీ హైస్కూల్‌ ) ఎన్‌.సంధ్య (జడ్పీ హైస్కూల్‌, నందలూరు , నజియా (నందలూరు ఉర్దూ స్కూల్‌) ఏ. ఉమామహేశ్వరి (నల్ల తిమ్మాయపల్లె స్కూల్‌), వై.లక్ష్మీ రమణ (లేబాక స్కూల్‌) ఎన్‌. ఇందు (టంగుటూరు స్కూల్‌) యు.అంజలి (పొత్తపి స్కూల్‌) ఆర్‌.త్రివేణి (ఆడపూరు గురుకుల పాఠశాల), ఎన్‌.బిందు, బి.కష్ణ లీలావతి (బిసి రెసిడెన్సియల్‌ స్కూల్‌,నందలూరు) బి. లోకేశ్వర్‌ (జడ్‌పి హైస్కూల్‌,నాగిరెడ్డిపల్లి) లను శాలువా లతో సత్కరించి జ్ఞాపికతో పాటు యండమూరి వీరేంద్రనాధ్‌ రచించిన విజయరహస్యాలు పుస్తకాలు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా బి.ధీరజ్‌కుమార్‌ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యలో రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణ తో ప్రణాళిక బద్దంగా చదవాలని ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు వెళ్తే విజయశికరాలు అందుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో కుర్రామణి యాదవ్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ దాసరి నరసింహులు, శ్యామనబోయిన గురుప్రసాద్‌, మోడపోతుల రాము, కొత్తపల్లి. రాజాచారి, గాడి సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.