ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: 200 మంది విద్యార్థులకు యుటిఎఫ్‌చే రూపొందించిన మోడల్ పేపర్స్‌ను డివైఇఒ కృష్ణప్ప ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో పెద్దమనసుతో యుటిఎఫ్ నాయకులు మోడల్ పేపర్స్‌ను విద్యార్థులు పంపిణీ చేయడం చాలా సంతోషమని పేర్కొన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించాలని తెలిపారు. తాను కూడా హాస్టల్ ఉండి చదివి ఈ స్థాయికి చేరుకు న్నానని తెలిపారు. ఎంపిడిఒ, ఎంఇఒ మాట్లాడుతూ మారిన పరీక్షలకు అను గుణంగా ఈ మెటీరియల్స్ రూపొందించామన్నారు. చడం జరిగినదని నివల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, అసోసియేట్ అధ్యక్షులు హేమలత, రాష్ట కౌన్సిలర్స్ రవి ప్రకాష్, పురం వెంకటరమణ, డివిజన్ కన్వీనర్ సుధాకర్, రిటైడ్ హెడ్మాస్టర్ శ్రీనివాసరాజు, వెంకటయ్య, హరికృష్ణ పాల్గొన్నారు.










